స్వీయ గణనతోనే జన గణన సులభతరం
మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి) : జనగణన - 2027లో భాగంగా స్వీయ గణనతో కార్యక్రమం సులభతరం అవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐ. బి. చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు చేపట్టిన మారథాన్ వాక్ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జిల్లా షెడ్యూల్ కలముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా యువజన క్రీడాసేవల అధికారి హనుమంత రెడ్డి, జిల్లా ఉపగణాంక అధికారి రాజేందర్ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయ గణనపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు మారథాన్ వాక్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన వివరాలు మనమే నమోదు చేద్దామని, స్వీయ గణనతో జనగణన సులభతరం అవుతుందని, జన గణన విజయవంతం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.






