26 May, 2026 | 1:01 AM

ధాన్యం తరలింపు కోసం రైతుల ట్రాక్టర్లు

26-05-2026 12:00 AM

నిర్మల్ మే 25 ( విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నిలువలు పెరిగిన నేపథ్యంలో సోమవారం లక్ష్మణ్ చందా మండలం రైతులు స్వయంగా ధాన్యాన్ని తరలించారు. గ్రామానికి చెందిన మొత్తం 200 పైగా రైతులు యువకులు వాహనాలను సేకరించి స్వచ్ఛందంగా గోదాములకు తరలించారు. సుమారు 170 ట్రాక్టర్లను దాన్యం తరలించడంతో గోదాం వద్ద ధాన్యం సంచులతో వాహనాలు పెద్ద క్యూ లైన్ కనిపించేది.