రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ మార్చి 9: రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని 11వ వార్డు లో శేరిపల్లి రోడ్డు దగ్గర రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ నిధుల నుండి మంజూరైన 10కోట్ల రూపాయలతో 10, 000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణ పనులకు రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రభుత్వానికి ప్రాధాన్యత గల అంశం అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సదుపాయం కల్పించడంలో ఈ గోదాం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందన్నారు.గోదాం నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాంగ్రెస్ నాయ కులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు




