21 April, 2026 | 2:47 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

21-04-2026 01:08 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. సోమవారం గంగాధర మండలం మధురానగర్ లో హాక నిర్వాహకుడు జాగిరపు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాక ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆతన మాట్లాడుతూ డీసీఎంఎస్, రైతు సేవా కేంద్రాల మాదిరిగానే హాక సర్వీస్ సెంటర్లో కూడా వ్యవసాయ సేవలు అందుతాయని తెలిపారు.

రైతులు హాక సర్వీస్ సెంటర్లను వినియోగించుకొని వ్యవసాయ సేవలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచ్లు సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, సర్పంచ్ లు కాడరి రేణుక కనుకయ్య, వేముల భాస్కర్, రెండ్ల శ్రీనివాస్, బాస వేణి శ్రీనివాస్, తూం రాజు, సత్తు కనుకయ్య, సాగి అజయ్ రావు, మేర్జ కొండయ్య, ప్రేమ్ కుమార్, మంత్రి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.