30 June, 2026 | 10:05 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అగ్రిమెంట్ వివాదం!

21-04-2026 01:08 AM

నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ప్రధాన గేటుకు తాళం 

మేడిపల్లి ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ప్రధాన గేటుకు భవన యాజమా న్యం సోమవారం తాళం వేసింది. అగ్రిమెంట్ వివాదంతో జరిగిన ఈ చర్యకు  విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందు లు పడుతు న్నారు. స్కూల్ యాజమాన్యం మార్చి 2027 వరకు ఒప్పందం ఉందని చెబుతుండగా భవన యాజమాన్యం మాత్రం గడువు ముగిసిందని తెలిపారు.

ఈ వివాదం మధ్య లో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మా రింది. దానికి తోడు నారాయణ కాన్సెప్ట్ స్కూల్ లీజు సమయం అయిపోతుండడంతో గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమా న్యం భవన యాజమాన్యంతో జనవరి 2 నుంచి  10 సంవత్సరాలు అగ్రిమెంట్ చే యించుకున్నామని, గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం తెలిపారు. ఏప్రిల్ 17 వరకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో నారాయణ స్కూ ల్ దగ్గరకు తాము రాలేదని, నెకస్ట్ అకాడమీ ఇయర్ కోసం తాము బిల్డింగ్ పొజిషన్ తీసుకోవడానికి రావడం జరిగిందని తెలిపారు.

మూడు నెలల ముందు నుంచి తమ స్కూలు అడ్మిషన్స్ కోసం టేబుల్ వేసుకొని అదే నారాయణ స్కూల్ గేటు ముందు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నామని, ఇదంతా నారాయణ స్కూల్ యాజమాన్యం చూస్తూ ఉందని అన్నారు. ఇక్కడ నడుస్తున్న నారాయణ స్కూల్‌కు ఎలాంటి పర్మిషన్ లేదని, దీనిపై ఎంఈఓ, డిఈవోలు కూడా నోటీసులు పంపడం జరిగిందని, నెకస్ట్ అకాడమి క్ ఇయర్ లోపు నారాయణ స్కూల్ ను ఇక్కడ నుండి కాళీ చేస్తున్నామని నారాయణ స్కూల్ యాజమాన్యం తెలిపింది. దీనిపై ఇరువురు ఇరు వర్గాలు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.