ద.మ రైల్వేకు పీఆర్‌ఎస్‌ఐ అవార్డులు
సికింద్రాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ద.మ రైల్వే ప్రజా సంబంధాల విభాగం మీడియా రిలేషన్స్ కమ్యూ నికేషన్ సోషల్ మీడియా కమ్యూనికేషన్ కేటగిరీల లో అవార్డులు కైవసం చేసుకుంది. పబ్లిక్ రిలే షన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ ఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించినపబ్లిక్ రిలేషన్స్ అవార్డ్స్-2026 కార్యక్రమం లో దక్షిణ మధ్య రైల్వే పబ్లిక్ రిలేషన్స్ విభా గం మూడు విభాగాలలో పురస్కారాలు అం దుకుంది. మీడియా రిలేషన్స్, క్రైసిస్ కమ్యూనికేషన్ విభాగంలో ప్రథమ బహుమతి, సోషల్ మీడియా కమ్యూనికేషన్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించింది.
ఈ అవార్డులు తెలంగాణ రైజింగ్ 2047 కమ్యూ నికేషన్, ఇన్నోవేషన్,ఎం పవర్మెంట్ అనే థీమ్‌తో బేగంపేట్‌లోని హోటల్ ది ప్లాజాలో జరిగిన 4వ తెలంగాణ పబ్లిక్ రిలే షన్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, ఓయూ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, తెలంగాణ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సి.హెచ్. ప్రియాంక చేతుల మీదుగా ఈ అవార్డులను పీఆర్ నిపుణుల సమక్షంలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ.శ్రీధర్, సీనియర్ పీ.ఆర్.ఓ ఎం. ప్రదీప్ కుమార్, దక్షిణ మధ్య రైల్వే పీ.ఆర్.ఓ కె. రాజేష్ అందుకున్నారు.






