నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సత్తుపల్లి, మార్చి 20 (విజయక్రాంతి): నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన సిద్ధారం సదాశివపేట రేజర్ల రైతులను ఆదుకోవాలని వెంకటరమణ స్వీట్స్ పంపిణీ పై చర్యలు తీసుకోవాలని ఎకరానికి 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు.
వెంకటరమణ షీడు కంపెనీ రైతులకు ఇచ్చిన విత్తనాలు నాసిరకంగా ఉండటం వల్ల వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో పంట చేతికందక వరి పొట్ట కు వచ్చి పాలు పోసుకోకుండా తాలుక కంకులతో రైతులు పంట లేక ఆందోళన పడుతున్న సదరు సీడ్ కంపెనీ యాజమాన్యం రైతులను పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించి రైతుల ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కోణంనేని సాంబశివరావు గారి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని అయిన వివరించారు.




