calender_icon.png 15 December, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

08-10-2025 01:16:08 AM

  1. కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి
  2. బిలాస్పూర్ జిల్లాలో పర్యాటకుల బస్సుపై పడిన కొండ చరియలు
  3. సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం

హిమాచల్‌ప్రదేశ్, అక్టోబర్ 7: హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమా దం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడి 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలోని ఝండుతా ప్రాంతంలోని బల్లూ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. మరోతన్ నుంచి ఘుమార్వీన్ వెళ్తున్న పర్యాటకుల బస్సుపై కొండ చరియలు విరిగిపడడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది.

దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్‌లు, డిసాస్టర్ మేనేజ్‌మెంంట్ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.గాయపడినవారిని సమీ ప ఆసుపత్రులకు తరలించారు.

ముఖ్యమం త్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగంతో సంప్రదించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుం బాలకు అన్ని విధాల సహాయాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.