కాబోయే డైరెక్టర్‌పై ఎఫ్‌బీఐ నిఘా!
15-12-2024 12:33 AM
వాషింగ్టన్, డిసెంబర్ 14: భారతీయ అమెరికన్ కశ్యప్ పటేల్‌పై అమె రికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) నిఘా పెట్టింది. ఈ విష యాన్ని న్యూ గవర్నమెంట్ వాచ్‌డాగ్ తన నివేదికలో వెల్లడించింది. 2020 ఎన్నికల్లో తన ఓటమికి కారణం ఎఫ్‌బీఐ ఉద్యోగులే కారణమని అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ గతం లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్‌గా కశ్యప్‌ను నియ మించనున్నట్టు తెలిపారు.
కశ్యప్ బా ధ్యతలు స్వీకరించిన అనంతరం ఎఫ్‌బీఐలో ప్రక్షాలన చేయనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగులు అభద్రతా భావానికిలోనై కశ్యప్‌పై నిఘా పెట్టినట్టు వాచ్‌డాగ్ తన నివేదికలో వివరించింది.






