స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్!
12 ఏళ్ల పిల్లాడి నిర్వాకం
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు వరుస గా బాంబు బెదిరింపులు వస్తుండటం కలకలం రేపుతోంది. శుక్రవారం పశ్చి మ విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌తో సహా పలు విద్యాసంస్థలకు కాల్స్ వచ్చాయి. అయితే ఈ కాల్స్ చేసింది 12 ఏళ్ల బాలుడిగా పోలీసులు గుర్తించారు. స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్నాయని మీడియా లో చూసి తాను మెయిల్ పంపినట్లు బాలుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
స్కూళ్లకు బాంబు బెదిరింపులు చేస్తున్న నిందితులను పట్టుకోవడం లేదనే ఆవేదనతో ఇలా చేశానని బాలు డు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. దీంతో అధికారులు బాలుడితో సహా అతడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిచారు. మరోవైపు శనివారం కూడా ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో సహా పలు విద్యాసంస్థలకు ఈతమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబ్ స్కాడ్ స్కూళ్లకు వెళ్లి చూడగా పేలుడు పదార్థాలు లభించలేదు.






