25 July, 2026 | 1:47 AM

ఫీజు బకాయి, బీజేపీ లడాయి

25-07-2026 12:00 AM

కొత్తగూడెం, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. యువ మోర్చా,మహిళా మోర్చా ఆధ్వర్యంలో, ఫీజు రియంబర్స్మెంట్ పై , స్కాలర్షిప్ల సమస్యల పై జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి  అధ్యక్షతన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఈ మేరకు జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఫీజు బకాయి బిజెపి లడాయి పోస్టర్ ను విడుదల చేశారు.