25 July, 2026 | 1:47 AM

కళాశాలల బంద్ విజయవంతం

25-07-2026 12:00 AM

ముకరంపుర, జూలై 24 (విజయక్రాంతి): నీట్ పరీక్ష పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యార్థులు, యువతపై అమానుషంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశా లలో బంద్ విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్,ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీట్, సీబీఎస్సీతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అవకతవకలు సర్వసాధారణంగా మారాయని అన్నారు.ఈ అంశంపై ప్రధానమంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకే అప్పగించాలని కోరారు.బంద్ కార్యక్రమం సందర్భంగా కరీంనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులు,డివైఎఫ్‌ఐ ఎఐవైఎఫ్ నాయకులు నిరసన చేపట్టగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.