calender_icon.png 21 February, 2026 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

21-02-2026 01:50:44 AM

  1. లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తాం

ఏబీవీపీ నాయకుల హెచ్చరిక 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యానగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన నిర్వహిం చారు. ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథివి తేజ, విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరిప్రసాద్ మాట్లాడుతూ.. విద్యా రంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.

రాబోయే బడ్జెట్ సమావేశా ల్లో విద్యాశాఖకు కనీసం 15 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిల వల్ల ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి బ కాయిలు చెల్లించాలని కోరారు. బడ్జెట్ సమావేశాల లోపు విద్యార్థుల సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి అసెంబ్లీని ముట్టడిస్తామని నేతలు హెచ్చరించారు. వి ద్యానగర్ జిల్లా కన్వీనర్ తేజ సాగర్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అక్షిత, స్టేట్ ఎస్‌ఎఫ్‌ఎస్ కో -కన్వీనర్ రిషి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆకాష్, చందు పాల్గొన్నారు.