రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ
చివ్వెంల, ఏప్రిల్ 8 : జాతీయ రహదారి65పై వల్లభాపురం గ్రామ శివారులో ఎచర్ల ముత్యాలమ్మ గుడి సమీపంలో జరిగిన డీసీఎం, టాటా ఏస్ వాహనాల రోడ్డు ప్రమాద స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్న ఆయన, అతివేగం మరియు అజాగ్రత్త డ్రైవింగ్ వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలని సూచించారు. సీటు బెల్టు ధరించడం, రోడ్డు పరిస్థితులను గమనించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ప్రమాదంపై నివేదిక సిద్ధం చేయాలని, రహదారి లోపాలు ఉంటే తెలియజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానికులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్త్స్ర కనకరత్నం పాల్గొన్నారు.




