7 September, 2026 | 9:04 AM

అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం

28-08-2026 | 08:13pm

బిక్కనూర్,(విజయక్రాంతి): బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులో అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. రాజంపేటకు చెందిన రైతు రమేష్ మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు దాడి చేయడంతో పంట పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని రైతు కోరారు.

మరిన్ని వార్తలు