డీసీసీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అన్నపూర్ణ మహిళా కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డికి రాఖీలు కట్టారు.
అనంతరం డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ మహిళా కాంగ్రెస్ నాయకులకు, జిల్లా ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, అర్లి గ్రామ సర్పంచ్ కామని అశోక్, భీంపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, విద్యాసాగర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు సంగీత, మందాకిని, ఖమర్ బేగం, ఖాలీందే బేబీ, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






