28 August, 2026 | 6:29 PM

పీజీ హెచ్‌ఎంగా పదవీ విరమణ పొందిన రాము నాయక్‌కు ఘన సన్మానం

12-07-2026 04:30 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖలో పీజీ హెడ్‌మాస్టర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన రాము నాయక్‌ను టీఎస్‌టిబ్ల్యూటీయూ ఆధ్వర్యంలో ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలోని బంధన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అశోక్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్‌తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు రాము నాయక్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ రాము నాయక్ ఉద్యోగ జీవితంలో నిబద్ధతతో పాటు సామాజిక బాధ్యతతో సేవలందించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అశోక్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాము నాయక్ చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు.