దుర్గమ్మ ఆలయానికి సహకరించిన దాతకు సన్మానం

12-09-2026 | 12:52pm

రుద్రంగి సెప్టెంబర్ 12(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి(Rudrangi) మండలంలోని దుర్గమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతను ఘనంగా సన్మానించారు.చందుర్తి మండలం లింగంపేట గ్రామనికి చెందిన బిరేల్లి సుధాకర్ రావు.ఆయన కొడుకు భాస్కర్ రావు,బోర్ మోటార్ మరియు వాటర్ ట్యాంక్ దుర్గమ్మ ఆలయానికి అందించిన సందర్భంగా రామాంజనేయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంన్మానించారు.

శనివారం రోజున సుధాకర్ రావు బోర్ మోటార్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.దుర్గమ్మ ఆలయం వద్ద నీటి సమస్య ఉందని చెప్పగానే సుధాకర్ రావు వెంటనే స్పందించి బోర్ మోటార్,  వాటర్ ట్యాంక్ అందించినందుకు భక్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు.సుధాకర్ రావు కుటుంబానికి ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు.భక్తుల కోరిన కోరికలు తీర్చే దుర్గమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి భక్తులు సహారించాలని కోరారు.....

మరిన్ని వార్తలు