17 July, 2026 | 4:29 AM

అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం

08-07-2026 07:45 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): అగ్నివీరులో భాగంగా ఇండియన్ నేవీలో మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన కోడాపాక వెంకట అఖిల్ ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా తాండూర్ గ్రామ సర్పంచ్ భూమా యాదగౌడ్ కోడపాక వెంకట అఖిల్ను కాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అగ్నివీరులో ఉద్యోగం సాధించినందుకు గ్రామానికి ఎంతో గర్వకారంగా ఉందన్నారు. గ్రామానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని తెలపడం జరిగింది.