8 July, 2026 | 8:15 PM

Breaking News

కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-07-2026 07:43 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్  ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అల్ఫోర్స్ డా.వి. నరేందర్ రెడ్డి  జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల సందర్భంగా టపాసులు పేల్చి కేక్ కట్ చేసారు. ప్రత్యేకంగా నరేందర్ రెడ్డి కి తలపాగా, ఖడ్గాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమం లో కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాస్, రాజ్ కుమార్, అఫ్రీన్, వరాల నరసింగం,  యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, ఎస్ టి సెల్ నాయకులు,ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.