8 July, 2026 | 8:35 PM

Breaking News

పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •  

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ

08-07-2026 07:47 PM

పాల్వంచ,(విజయక్రాంతి): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఎస్సి విభాగం అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సి విభాగం విడుదల చేసిన జిల్లా, మండలాల అధ్యక్షులను బుధవారం  జిల్లా చైర్మన్ గద్దల రమేష్ నియమించారు. పాల్వంచ టౌన్ ఎస్సీ సెల్ విభాగం మండల అధ్యక్షుడిగా గోలి సదశివను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన గోలి సదాశివ  మాట్లాడుతూ పార్టీ కోసం కార్యకర్తల కోసం, నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడతానన్నారు.

అర్హులైన  ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి అందజేస్తానని, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధి విధానాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానni స్పష్టం చేశారు. ఈ పదవి కేటాయించిన రాష్ట్ర మంత్రులుకు, టి పి సి సి చైర్మన్ లకు, జిల్లా అధ్యక్షులుకు జిల్లా  నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీకి సేవ చేస్తానని నాకీ పదవి కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.