9 July, 2026 | 1:38 AM

అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం

09-07-2026 12:44 AM

నాగిరెడ్డిపేట్, జులై 8 (విజయక్రాంతి): అగ్నివీరులో భాగంగా ఇండియన్ నేవీలో మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన కోడాపాక వెంకట అఖిల్ ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా తాండూర్ గ్రామ సర్పంచ్ భూమా యాదగౌడ్ కోడపాక వెంకట అఖిల్ను కాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అగ్నివీరులో ఉద్యోగం సాధించినందుకు గ్రామానికి ఎంతో గర్వకారంగా ఉందన్నారు.గ్రామానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాండూర్ గ్రామ సర్పంచి యాదగౌడ్, ఉపసర్పంచ్ అభిషేక్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దివిటీ కిష్టయ్య,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.