28 August, 2026 | 2:10 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు వైఎస్‌ఆర్

09-07-2026 12:46 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూలై 8 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్  వివిధ సంక్షేమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.బుధవారం వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకొని పంజాగుట్ట,ఎల్లారెడ్డిగూడల్లోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం వైఎస్‌ఆర్ నిరంతరం కృషి చేశారన్నారు. ఆయన అమలు చేసిన పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.ప్రజాసేవే పరమావధిగా వైఎస్‌ఆర్ పాలన సాగిందని గుర్తు చేసుకున్నారు. ఆయన నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.