18 July, 2026 | 8:41 PM

Breaking News

సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •  

కందుల సంధ్యారాణికి ఘన సన్మానం

16-05-2026 07:38 PM

సుల్తానాబాద్, (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగానియమితులైన కందుల సంధ్యారాణి ని పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సంధ్యారాణికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు రావడం సంతోషకరమన్నారు.

ఆమె నాయకత్వంలో ఓబీసీ మోర్చా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కొల్లూరి సంతోష్ కుమార్, కోట నాగేశ్వర్,తీగల అశోక్ గౌడ్, వడ్లకొండ శశివర్ధన్, శేఖర్ మాస్టర్, వల్స సాయి కిరణ్,సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు.