18 July, 2026 | 8:59 PM

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి

18-07-2026 08:23 PM

* ఎల్ నినో ప్రభావంతో వర్షాపాతం తక్కువ

* ప్రత్యామ్నాయ పంట సాగుపై రైతులకు అవగాహన

పాపన్నపేట: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని డీఎల్పిఓ(మండల స్పెషల్ ఆఫీసర్) యాదయ్య, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రాజ్ సూచించారు. శనివారం మండల పరిధిలోని మల్లంపేట రైతు వేదికలో రైతులకు ప్రస్తుత వాతావరణంపై ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయంపై ఏ విధంగా ప్రభావం చూపించనుందో అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు అవసరం ఫై రైతులు దృష్టి సారించాలన్నారు.