గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో శనివారం చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం విస్తృతంగా పర్యటించి గ్రామాల్లో స్వశక్తి సంఘాల భవన నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మల్కాపూర్, అనంతపల్లి, బోయినపల్లి, స్తంభం పెళ్లి, విలాసాగర్, కొదురుపాక గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. జగిత్యాలకు ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అక్కడ నూతన గిడ్డంగి (గోదాం) నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం బీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ లూమ్ మ్యాక్ సొసైటీ బతుకమ్మ చీరల కేంద్రాన్ని సందర్శించి కార్మికుల, నేతన్నల పనితీరును పరిశీలించారు.






