18 July, 2026 | 9:11 PM

సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం

18-07-2026 08:38 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): నగరంలోని సిద్ధార్థ విద్యాసంస్థల స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ  వేడుకలు భగత్నగర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్  స్వప్న రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు. పాఠశాలలోని ధోని టీమ్, మెస్సీ టీమ్, ధ్యాన్ చంద్ టీమ్, విశ్వనాథన్ ఆనంద్ టీములకు చెందిన విద్యార్థులు కవాతు చేస్తూ అతిథులకు గౌరవ వందనం చేసారు. స్కూల్ లీడర్స్ గా ఎంపికైన స్కూల్ క్యాప్టన్, స్టోర్ట్స్ క్యాప్టన్ టీమ్ క్యాప్టన్ విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేసారు.

అనంతరం సిద్ధార్థ పాఠశాల ఫౌండర్ దాసరి నర్సింహారెడ్డి  జ్ఞాపకార్థం డి.ఎన్.ఆర్. స్కాలర్షిప్ పేరుతో గత సంవత్సరం అకాడమిక్ లో అత్యున్నత ప్రతిభకనబరిచిన విద్యార్థులందరికీ 10,000 చొప్పున నగదు పారితోషికం, ఎక్స్టెర్నల్ ఐ.ఐ.టి మెరిట్ స్కాలర్షిప్, సర్టిఫికెట్, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు,100% అటెండెన్స్ కలిగిన విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్ జ్ఞాపికలను ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.