8 April, 2026 | 12:01 AM

విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సంజీవరెడ్డికి ఘన సన్మానం

07-04-2026 10:04 PM

హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీలో ఇటీవల స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎంపికైన కందుల సంజీవరెడ్డిని సంఘం సభ్యులు హనుమకొండ రాంనగర్ లోని కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. కందుల సంజీవరెడ్డి గతంలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగిగా సేవలందిస్తూ 1990 నుండి 2020 వరకు ఉద్యోగ సంఘం నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా విశేష సేవలు అందించారు.

ఆయన నాయకత్వ పటిమను, అనుభవాన్ని గుర్తించిన టిఎస్జిఆర్ఇఎ రాష్ట్ర కమిటీ ఆయనను రాష్ట్ర కమిటీ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నగరశాఖ అధ్యక్షులు మల్లారెడ్డి, కార్యదర్శి శ్రీరాములు, సభ్యులు సదానంద చారి, నరసింహ చారి, రాజశేఖరం,సమ్మయ్య, ఖాజానయీముద్దీన్, శేషయ్య తదితరులు సంజీవరెడ్డిని శాలువాతో, పూలదండతో ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకంతో రాష్ట్ర బాధ్యతను అప్పగించినందుకు సం జీవరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.