2 June, 2026 | 8:03 PM

జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం

02-06-2026 07:02 PM

వీర్రాజు డీఐజీపీ సీఆర్పీఎఫ్ రంగారెడ్డి క్యాంపస్

జవహర్ నగర్,(విజయక్రాంతి): జాతీయస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలకు సీఆర్పీఎఫ్ విద్యార్థులు ఎంపికవ్వడం అభినందనీయమని  డీఐజీపీ వీర్రాజు అన్నారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ప్రిన్సిపల్ డి. అపర్ణ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ క్యాంపస్ లో వీర్రాజు డీఐజీపీ సమక్షంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వీర్రాజు డీఐజీపీ హాజరై మాట్లాడుతూ మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ యువత చదువు, క్రీడలవైపు దృష్టి సారించాలనిపిలుపునిచ్చారు.

క్రీడలతో ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దిన పీఈటీ రాజశేఖర్ ను అభినందించారు. ఈ నెల 5 నుంచి 8వరకు రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, సత్యనారాయణ, రాజశేఖర్, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.