22 July, 2026 | 3:58 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2026 06:58 PM

భద్రాచలం,(విజయక్రాంతి): స్థానిక సెయింట్ పాల్స్ ప్రాంగణంలో 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ కే అబ్రహం, డాక్టర్ కే రాధా మంజరి మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఉపాధ్యాయులు వారి సందేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను వివరించారు.

అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ మరియు ప్రధానోపాధ్యాయురాలు అయిన డాక్టర్ కె అబ్రహం మరియు డాక్టర్ కే రాధా మంజరి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎందరో మహానీయుల త్యాగాలు ఉన్నాయని వారి త్యాగాలు వృధా కాకుండా ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తూ తమ వంతుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు