24 August, 2026 | 2:25 PM

పచ్చదనంపై గొడ్డలి వేటు

22-05-2024 12:03 AM

జయశంకర్ భూపాలపల్లి, మే 21 (విజయక్రాంతి): పచ్చని చెట్లపై గొడ్డలివేటు పడుతోంది. అధికారుల ముందు చూపులేని కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. మొక్కలు నాటి పర్యావరణంలో సమతూల్యత తీసుకువచ్చేందుకు ఓ వైపు ప్రభుత్వాలు కృషి చేస్తుండగా.. మరోవైపు ఆ పచ్చదనంపై అధికారులే గొడ్డలి వేటు వేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డు నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లే దారిలో హరితహారంలో భాగంగా పెంచిన మొక్కలను విద్యుత్తు అధికారులు తొలగిస్తున్నారు. చెట్లు ఏపుగా పెరిగి విద్యుత్ తీగలకు తగిలి అంతరాయం కలిగిస్తున్నాయని నరికేస్తున్నారు. నిబంధనల ప్రకారం చెట్ల కొమ్మలు మాత్రమే తొలగించాల్సి ఉండగా.. కొన్నిచోట్ల మొదళ్లు, మరికొన్నిచోట్ల మధ్యలోకి ఇలా నరికేస్తున్నారు.