హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సాయం
22-05-2024 12:05 AM
రాజన్న సిరిసిల్ల, మే 21 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి తోటి ఉద్యోగులు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. 1995 ఏఆర్ బ్యాచ్‌కు చెందిన గంగా ధర అంజయ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏఆర్ హెడ్ కార్టర్స్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిరహిస్తున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబానికి ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన 1995 బ్యాచ్ ఆర్ముడ్ రిజర్ సిబ్బంది అండగా నిలిచి రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం అందించారు. మంగళవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతులమీదుగా అంజయ్య కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ యాదగిరి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, మల్లేశం, ప్రభాకర్, బాలు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






