24 August, 2026 | 1:09 PM

బదిలీలు, పదోన్నతులు త్వరగా చేయాలి

22-05-2024 12:07 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 21 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవులు అయ్యేలోపు పూర్తి చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విద్యాశాఖ అధికారులను నియమించాలని కోరారు. ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున పాఠశా లల్లోని ఖాళీలను విద్యా వలంటీర్లతో భర్తీ చేయాలని కోరారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందురావు, ఉపాధ్యక్షుడు హేమంత్ షిండే, కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.