11 August, 2026 | 1:33 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

తొలి, మలి ఉద్యమకారున్ని పరామర్శించిన తోటి ఉద్యమకారులు

18-06-2025 08:27 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తొలి మలి ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించి 1969 తెలంగాణ ఉద్యమ పోరాట సమితి స్థాపనలో ముఖ్య నాయకుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఒలీ బాబా గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎం ఒలి బాబాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లపల్లి దయానంద్, పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ బోయిన నరసయ్య ముదిరాజ్, కాకెల్లిసైమన్, హరి గోపాల్, గిరీశం, మల్లేష్, బాల్రాజ్ లు బుధవారం పరామర్శించి శాలువతో సత్కరించారు.

త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా శ్రావణ బోయిన నరసయ్య ముదిరాజ్ మాట్లాడుతూ... ఉద్యమకారుల పుణ్యమా అంటూ నాయకులు పాలకులై ఉద్యమకారులను బిచ్చగాళ్ళుగా చేసిన వైఖరిని సమాజం ఉద్యమకారులు ఎన్నడూ క్షమించరని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులకు తగిన న్యాయం చేస్తారని ఆశించారు.