4 June, 2026 | 1:10 AM

మహిళా కూలి అనుమానాస్పద స్థితిలో మృతి

04-06-2026 12:38 AM

మూడు రోజులకు వెలుగు చూసిన మృతదేహం 

హత్యనా లేక రోడ్డు ప్రమాదమా అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు 

కామారెడ్డి, జూన్ 3 (విజయక్రాంతి): కూలి పనుల కోసం భార్యాభర్తలు కామారెడ్డి జిల్లా కేంద్రానికి భర్తకు కూలి దొరకడంతో భార్య కూలీ లభించకపోవడంతో ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటికి వెళ్లలేదు. మూడు రోజులకు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో రైల్ పట్టాల పక్కన ముళ్ల పోదల మధ్యన దుర్వాసనం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన నరసాపురం శ్యామల (40) సంవత్సరాలు , తన భర్త రాజoతో కలిసి ఆదివారం కూలి పనుల కోసం కామారెడ్డికి వచ్చారు. భర్త రాజంకు కూలి పని దొరకడంతో పని పైకి వెళ్ళాడు. అతని భార్య శ్యామలకు కూలి పని లభించకపోవడంతో కూరగాయలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తానని భర్తతో చెప్పింది.  రాజం ఆదివారం రాత్రి ఇంటికి వెళ్ళాడు. భార్య శ్యామల ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. బంధువులు, మిత్రులకు అడిగి తెలుసుకున్నారు.

ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. సోమవారం కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గర్లో ముళ్ళ పొదలలో మహిళా శవం కుళ్ళిపోయి ఉండడంతో ఆశవం శ్యామల మృతదేహంగ  గుర్తించారు.

కామారెడ్డి డిఎస్పి మధుసూదన్, పట్టణ సిఐ నరహరి, దేవునిపల్లి ఎస్త్స్ర రంజిత్, పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృత దేహం కుళ్ళిపోయి ఉండడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కూలి పనుల కోసం వచ్చిన శ్యామల మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. హత్య చేసి కనిపించకుండా పొదల్లో వేశారా, లేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే రోడ్డు పక్కన పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.