4 June, 2026 | 1:30 AM

త్వరలో సైబరాబాద్ సీఎంసీ ప్రధాన కార్యాలయం శంకుస్థాపన

04-06-2026 12:39 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే భూమి పూజ

శేరిలింగంపల్లి,జూన్ 3 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్లో ఖానమేట్లో మొండికుంట చెరువు సమీపంలో నూతన సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని (సిఎంసి) కమిషనర్ శ్రీజన తో కలిసి పరిశీలించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ..ప్రజల సౌకర్యం కోసం అన్ని ఆధునిక సౌకర్యాలతో సీఎంసీ భవనం నిర్మించనున్నట్లు చెప్పారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.2000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టనన్నుట్లు గాంధీ తెలిపారు. ఈ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీపీ రితీరాజ్, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, మాదాపూర్ సిఐ కృష్ణ మోహన్,అధికారులు పాల్గొన్నారు.