రోగులకు మెరుగైన సేవలు అందించాలి
జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్, జూన్ 3 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. ఆయన బుధవారం నాడు పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అంటూ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రిలో అత్యవసరమైన పాముకాటు, వైద్యానికి సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలన్నారు.కార్యక్రమంలో పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్, డి సి హెచ్ ఎస్ భాస్కర్, డిప్యూటీ డిఎంహెచ్వో రోహిత్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.






