కోనరావుపేటలో ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఫెర్టిలైజర్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం ఎరువుల దుకాణాలు పూర్తిగా మూసివేయబడ్డాయి.ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ చేపట్టినట్లు మండల ఫెర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా డీలర్లు బైక్ ర్యాలీలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎఫ్‌ఓఎల్, లింక్ ప్రొడక్ట్స్, డీలర్ మార్జిన్ పెంపు, హెచ్‌టీ బీటీ కాటన్, సాంపిల్ కలెక్షన్, కొత్త చట్టాల్లో శిక్షలు వంటి పలు సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌కు మండలంలోని డీలర్లు సంపూర్ణ మద్దతు ఇవ్వడం పట్ల అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.






