10 March, 2026 | 3:12 AM

కృషి సఖీలకు క్షేత్రస్థాయి శిక్షణ

06-02-2026 10:01 PM

జాతీయ పకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జాతీయ పకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా కృషి సఖీలకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తిర్యాని మండలంలోని చింతల మాదొర గీతా మందిర్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, గుడిపేటలోని జీవ ఎరువుల వనరుల కేంద్రం, అలాగే పెందూర్ లక్ష్మీ సమగ్ర పకృతి వ్యవసాయ క్షేత్రాలను కృషి సఖీలు సందర్శించారు.

ఈ సందర్భంగా కృషి సఖీలు వివిధ పంటల వైవిధ్యం, మిశ్రమ పంటలు, సరిహద్దు పంటలు, పండ్ల మొక్కలు, పూల మొక్కల సాగు విధానాలపై అవగాహన పొందారు. గుడిపేటలోని జీవ ఎరువుల వనరుల కేంద్రంలో జీవామృతం, ఘన జీవామృతం, అగ్ని అస్త్రం, నీమాస్త్రం వంటి జీవ ఎరువుల ప్రత్యక్ష తయారీ విధానాలను ప్రాయోగికంగా నేర్చుకున్నారు.