calender_icon.png 6 February, 2026 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు

06-02-2026 09:58:22 PM

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల,(విజయక్రాంతి): ప్రజా ఆశీర్వాదంతో బిఆర్ఎస్ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నారని, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సారధ్యంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలు గుర్తుపెట్టుకున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీలో 8,11,12 వార్డులలో ఆయన విసృత స్థాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ కేసీఆర్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే ఓట్లు అభ్యర్థించారు.

ఆయన మాట్లాడుతూ...  ప్రజా ఆశీర్వాదంతో చిట్యాల  వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నారని, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సారధ్యంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలు గుర్తుపెట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్  చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలన్ని ప్రజలు గ్రహించారని, కేసీఆర్  లాంటి గొప్ప నాయకుడిని పోగొట్టుకొని తప్పుచేసామని ప్రజలంతా ఇప్పుడు భాద పడుతున్నారని పేర్కొన్నారు. చిట్యాల మున్సిపాలిటీలో మీరు, మేము చేసిన పనులతో కనకదుర్గమ్మ సాక్షిగా ప్రజలతో రెఫరెండం తీసుకుందామని వెళ్ళడించారు.

చిట్యాల మున్సిపాలిటీలో తాము పనులు చెయ్యలేదని నిరూపిస్తే తమ అభ్యర్థులందరినీ పోటీ నుండి తప్పిస్తానని, కాంగ్రెస్ నాయకులు ఎన్ని అసత్య ఆరోపణలు, విష ప్రచారాలు చేసినా ప్రజలంతా బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. 25 నెలల్లో చిట్యాల మున్సిపాలిటీకి స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడో శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలకు రావాలని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఐదేండ్లలో ఏం చేశానో గల్లీ గల్లీకి తిప్పుతూ చేసిన అభివృధి చూపిస్తానని, తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రజలు కారు గుర్తుపై ఓటెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం, దీవెనలతో చిట్యాల మున్సిపాలిటీలో పన్నెండుకు పన్నెండు సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.