ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సేవలు పునరుద్ధరించాలి
04-08-2026 12:00 AM
నాగర్ కర్నూల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): 2026 ఆర్థిక సంవత్సరానికి ఫీల్ టెక్నికల్ స్టాఫ్ సేవలను పునరుద్ధరిస్తూ జిల్లా కలెక్టరేట్ ద్వారా వేతనాల చెల్లింపును కొనసాగించి, పెండింగ్లో ఉన్న 15 నెలల బిల్లులను విడుదల చేయడానికి కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్కు ఫీల్ టెక్నికల్ స్టాఫ్ వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫీల్ టెక్నికల్ స్టాఫ్ సేవలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. సేవల పునరుద్ధరణతో పాటు పెండింగ్ బిల్లులు త్వరితగతిన విడుదల చేస్తే సిబ్బందికి ఆర్థిక ఇబ్బందులు తొలగి విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు.






