4 August, 2026 | 1:52 AM

ఉద్యమ వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళి

04-08-2026 12:00 AM

మాజీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి , ఆగస్టు 3 : తెలంగాణ ఉద్యమ వీరుడు, నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్ది అకాలమరణం, బిఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి పార్టీ కార్యాలయం లో ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించి, కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. ఆయన చేసిన పోరాట కృషి ని భవిష్యత్ తరాలకు తెలియ చేద్దామని అన్నారు.

గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. రైతుల ఎస్సారెస్పీ జలాలు రాకపోవడంతో, సాగునీటి ఎద్దడి ఏర్పడి, పెట్టినటువంటి వరి పైర్లు, ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతుల అభీష్ట మేరకు, ప్రభుత్వం ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్ ,దొంగరి శ్రీనివాస్. మేడదుల రమేష్. వెంకటమ్మ కరుణాకర్. వెంకటేష్. వెంకన్న. వెంకటేష్. సాయికిరణ్. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.