11 March, 2026 | 2:48 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

హోరాహోరిగా హ్యాండ్‌బాల్ పోటీలు

04-11-2024 01:31 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా బాలికల పాఠశాలలో గత రెండు రోజులుగా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్వర్యంలో సదానందం(పీడీ) జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న 38వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి.

ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీ ఫైనల్‌లో కరీంనగర్‌పై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించగా, రంగారెడ్డిపై మహబూబ్‌నగర్ జట్టు గెలుపొందింది. సోమవారం జరుగనున్న ఫైనల్ పోటీల్లో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జట్లు తలపడనున్నాయి.