పశ్చిమాసియాలో భీకర యుద్ధం
అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు ఉధృతం
ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో ఆరుగురు మృతి
వాషింగ్టన్/టెహ్రాన్/బీరుట్, జూన్ 10: అమెరికా, ఇజ్రాయెల్‌ేొఇరాన్ మధ్య మరోసారి వైమానిక, డ్రోన్ల దాడులతో పశ్చిమా సియా దద్దరిల్లింది. హోర్ముజ్ సమీపంలో అపాచీ హెలికాప్టర్ కూల్చివేసిన ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు చేసింది. టెహ్రా న్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తోంది.
గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లు, క్షిపణులతో విరుచుకపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెరికా నావికా ప్లీట్‌తో పాటు, జోర్డాన్‌లోని ఆ దేశానికి చెందిన అల్ అజ్రాక్ వైమానిక స్థావరం లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. తమ భూభాగంపై దాడులు ఇలానే కొనసాగితే.. తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
దీనికి ముందు దక్షిణ ఇరాన్‌లోని జాస్క్, సిరిక్, ఖేష్ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా అమెరికా దళాలు దాడులు చేశా యి. ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడు లు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడులను ట్రంప్ సమర్థించుకున్నారు. ఓమీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌కు గట్టి సందేశం ఇచ్చేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే మరోపక్క బుషెహర్ ప్రావి న్స్‌పై అమెరికా డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది.
దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అయితే, ఈ ప్రకటనను అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు. దా డుల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. అమెరికా తమ సహనాన్ని పరీక్షిస్తోందని, దాడు లు, బెదిరింపులకు తమ సాయుధ దళాలు కచ్చితంగా స్పందిస్తాయని పేర్కొన్నారు. దక్షిణ లెబనాన్‌లోని కఫర్షుబాలో బుధవా రం ఒక మున్సిపల్ కౌన్సిలర్‌ను, ఒక కార్మికుడిని ఇజ్రాయెల్ సైనిక సిబ్బంది అదుపు లోకి తీసుకున్నారు.
మరోపక్క ఇరాన్ దాడులను బహ్రెయిన్ ఖండించింది. తమ వైమా నిక రక్షణ వ్యవస్థలు ఇరాన్ పలు క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టాయని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని టైర్ జిల్లాలోని తైర్ డెబ్బాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దా డుల్లో ఆరుగురు మరణించారు. మరోపక్క దౌత్య ప్రయత్నాలను అమెరికా దెబ్బతీస్తోందని ఇరాన్ ఆరో పించింది. దాడుల నేప థ్యంలో, యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలను అమె రికా బలహీన పరుస్తోందని పేర్కొంది.
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ను పూర్తిగా ఓడించామని, సైనిక పరంగా ఆ దేశాన్ని సర్వనాశనం చేశామని బుధవారం పేర్కొన్నారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి సమయం మించిపోతున్నా.. ఇరాన్ నేతలు ఇంకా జాప్యం చేస్తున్నారని ఆగ్రహించారు.
దీంతో ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. ఇరాన్ నేతలవి మాటలు తప్ప చేతలు ఏమీ ఉండవని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఒప్పందం విషయంలో ఆలస్యం చేస్తున్నందుకు టెహ్రాన్‌లోని విద్యుత్ కేంద్రా లు, వంతెనలపై తమ సైన్యం నూతన దాడు లు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలస్యం చేస్తే ఆ దేశం మరిన్ని క్లిష్టపరిస్థితులు ఎదుర్కోవడం తప్పదని వెల్లడించారు.






