బడ్జెట్లో విద్యా రంగానికి పదిహేను శాతం నిధులు కేటాయించాలి
కొత్తపల్లి,(విజయక్రాంతి): ఎబివిపి కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు మల్యాల రాకేష్, పూసాల విష్ణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ విద్యారంగానే విస్మరిస్తూ వస్తూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్న విద్యార్థుల జీవితాలు మారట్లేదు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల గడిచాయి అయినప్పటికీ విద్యారంగంలో ఉన్న సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేని కారణంగా పేద బడుగు బలహీన విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారనీ ఆరోపించారు.
జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో బోధన బోధనేతర సిబ్బంది లేని కారణంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు నోచుకోలేక మధ్యంతరాన చదువులు మానుకొని కూలీలుగా మారే దుస్థితికి ప్రభుత్వమే దిగజార్చిందని ఎద్దేవ చేశారు. విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను త్వరితగతిన చేయకపోగా విద్యార్థుల ఆశయాలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తుంది. యూనివర్సిటీలలో బోధన, బోధనేతర సిబ్బంది లేని కారణంగా తగినన్ని ల్యాబ్ సౌకర్యాలు, కంప్యూటర్లు హాస్టల్ వసతి, కొత్త కోర్సులు, వృత్తిరీత్యా కోర్సులు లేని కారణంగా విద్యార్థులు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్న కారణంగా చదువులు మానేయాల్సి న పరిస్థితి ఏర్పడింది.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలను బాగు చేసే విధంగా విద్యారంగాన్ని మెరుగుపరిచి మౌలిక వసతులను హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని హాస్టళ్లకు పక్కా భవనాలను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో విద్యారంగానికి పదిహేను శాతం నిధులను కేటాయించి, విద్యారంగానికి పెద్దపీట వేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని లేని పక్షంలో అసెంబ్లీ నడవకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగ్, జిల్లా కన్వీనర్లు అశ్విని, నిత్య శ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, జోనల్ ఇంచార్జ్ లు ఆకాష్ ప్రశాంత్, ఎస్ఎఫ్ఎస్ జిల్లా ఇంచార్జ్ నాగరాజు పాల్గొన్నారు.




