అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి
యుద్ధం వద్దు శాంతి ముద్దు
పల్లా నర్సింహా రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
దేవరకొండ,(విజయక్రాంతి): యుద్ధం వద్దు శాంతి ముద్దు, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం దేవరకొండ పట్టణమలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతవుతున్నారు.
ఇందుకు ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోదీ సర్కార్ విధాన వైఫల్యాలే కారణం. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దం, ఇటు గల్ఫ్ దేశాలలో చమురు క్షేత్రాలపై దాడి, కీలకమైనో హెూర్మూజ్ జలసంధి నుంచి చమురు ఎగుమతి నౌకలను వెళ్లనీయకుండా ఇరాన్ అడ్డుకోవడం వంటి చర్యలతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రమైంది. అని అన్నారు.




