6 May, 2026 | 10:16 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

‘కెనరా విద్యాజ్యోతి’ కింద 49.44 లక్షలు పంపిణీ

15-08-2024 02:23 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ‘కెనరా విద్యాజ్యోతి’ స్కాలర్‌షిప్ 2024 కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లోని సర్కిల్ కార్యాల యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ డైరెక్టర్ జీ సునీల్‌కుమార్ బాబు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు బ్యాంక్ జనరల్ మేనేజర్ బీ చంద్రశేఖర్ ప్రారంభించారు.

కెనరా బ్యాంకు వ్యవస్థాపకులు అమ్మెంబళ సుబ్బారావుకు నివాళిగా కెనరా విద్యాజ్యోతి పథకం ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మెరిటోరియస్ బాలికలకు స్కాలర్‌షిప్‌లను అందించ డానికి 2013 ఈ కార్యక్రమం ప్రారంభించబడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని కెనరా బ్యాంకు బ్రాంచ్‌లలో ఎంపిక చేయబడిన 1236 మంది ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ బాలికలకు రూ. 49.44 లక్షలు పంపిణీ చేశారు.