calender_icon.png 27 August, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుణోదయ సాంస్కృతిక ఉద్యమానికి 50 ఏళ్లు

05-12-2024 01:09:02 AM

  1. 14, 15వ తేదీల్లో వేడుకలు
  2. పోస్టర్ ఆవిష్కరించిన ప్రొఫెసర్ తిరుమలరావు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఆధిపత్య ఛాందసవాదం, సాంస్కృతిక సామ్రాజ్యవాదంపై గళమెత్తుతూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 ఏళ్ల నుంచి గళమెత్తుతున్నదని వేడుకల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు కొనియాడారు. సమా ఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి బుధవారం ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.

14, 15 తేదీల్లో బాగ్‌లింగం ఎస్వీకేలో నిర్వహించనున్న 50 వసంతాల సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తొలి రోజు సుందరయ్య పార్క్  నుంచి వీఎస్టీ ఫంక్షన్ హాల్ వరకు ప్రజాకళల ప్రదర్శన, తర్వాత సభ, కల్చరల్ నైట్  ఉంటుందన్నారు. ప్రొఫెసర్ జ్ఞాన అలోషియస్ (న్యూ ఢిల్లీ), సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ ప్రారంభోపాన్యాసాలు చేస్తారన్నారు.

15న ఎస్‌వీకేలో ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. సమాఖ్య  ఓయూలో పురుడుపోసు కుందన్నారు. శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటాలు, గోదావరి లోయ నుంచి కరీంనగర్ వరకు విస్తరించిన రోజుల్లో జార్జిరెడ్డి నాయకత్వాన విప్లవ విద్యార్థి సంఘం ఏర్పడిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో కట్టా భగవంతరెడ్డి, మల్సూరు, రమేష్ పోతుల, ప్రభాకర్, అల్లూరి విజయ్, రాకేశ్, నాగిరెడ్డి, ధనలక్ష్మి, శ్రీను, గిరి, రాము పాల్గొన్నారు.