13 March, 2026 | 7:55 PM

విద్యాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి: డీఈఓ లలిత

13-03-2026 05:48 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో విద్యారంగం అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు సమష్టిగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి లలిత అన్నారు. శుక్రవారం తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రాస్మా) ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈఓ లలితను జ్ఞాపిక, శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని పాఠశాలలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు దేవాబుషణం మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు.