ఘనంగా మొల్ల జయంతి
13-03-2026 05:42 PM
ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో మొల్ల మాంబ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘం రాష్ట్ర కోశాధికారి నమిలి కొండ ప్రభాకర్ మాట్లాడుతూ మొల్ల సామాన్య కుమ్మర కులంలో జన్మించిన 16వ శతాబ్దంలోనే స్వయంగా చదువుకుని సంస్కృతంలోని రామాయణంను తెలుగులో సరళ సుందరంగా రచించి ఆదర్శంగా నిలిచారన్నారు. మొల్ల జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమ్మర సంఘం బాధ్యులు కోరేపు లక్ష్మయ్య, రాధారపు శ్రీనివాస్, మల్లేష్, సదానందం, అంజలి, రేణుక, రవీందర్, శంకర్ , శ్రీనివాస్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.




